కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో టీడీపీ నేతల సుదీర్ఘ మంతనాలు…

నవతెలంగాణ – నెల్లూరు
నెల్లూరు జిల్లా రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ఇటీవలే వైసీపీపై తిరుగుబాటు చేసి ఆ పార్టీ నుంచి బహిష్కృతుడైన ఎమ్మెల్యే కోటంరెడ్డి టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోటంరెడ్డి నివాసానికి వెళ్లిన టీడీపీ నేతలు ఆయనతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. కోటంరెడ్డిని కలిసిన టీడీపీ నాయకుల్లో మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, వేమిరెడ్డి పట్టాభి ఉన్నారు. చర్చల సందర్భంగా కోటంరెడ్డిని టీడీపీలోకి వీరు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 13న టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

Spread the love