అప్సర హత్య కేసులో సాయికృష్ణకు 14 రోజుల రిమాండ్

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో ప్రధాన నిందితుడు పూజారి వెంకట సాయి సూర్య కృష్ణను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈరోజు ఉదయం నిందితుడిని జడ్జి ఇంటి ముందు శంషాబాద్ ఆర్జీఐ పోలీసులు హాజరుపరిచారు. సాయికృష్ణకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈక్రమంలో నిందితుడిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

Spread the love