సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాశ్‌రెడ్డి…

నవతెలంగాణ – హైదరాబాద్
మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి శనివారం ఉదయం సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఎంపీని సీబీఐ విచారించనుంది. ముందస్తు బెయిల్ పొందిన తరువాత అవినాశ్ రెండో సారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఐదు మంది అధికారులు ఎంపీని విచారించనున్నారు. వివేకా హత్య జరిగిన రోజు మధ్యరాత్రి మాట్లాడిన వాట్సప్‌ కాల్స్‌పైనే సీబీఐ అధికారులు ప్రధానంగా ఆరా తీయనున్నారు. ఈరోజు విచారణలో ఆరు అంశాలపై ఎంపీ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉంది.

Spread the love