లయన్స్ క్లబ్ ఆఫ్ చండూరు సేవ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ..

 నవతెలంగాణ – చండూరు 
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెల్ల దశరథ  సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ చండూరు సేవ ఆధ్వర్యం, చేనేత పరిరక్షణ సేవాసమితి సమాచార సహకారంతో మున్సిపల్ కేంద్రంలో ఎవరూ లేనటువంటి ఇరవై మందికిపైగా నిరుపేదలకు శుక్రవారం దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.  ఈ సందర్భంగా  లయన్స్ క్లబ్ ఆఫ్ చండూరు సేవ అధ్యక్షులు (ఎం. జె. ఎఫ్ )లయన్ కొత్తపాటి సతీష్ మాట్లాడుతూ  సాయం చేయడంలో  తమ ఆర్గనైజేషన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే పలు కార్యక్రమాలలో చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లయన్ నెల్లూరి శ్రీనివాస్, కోశాధికారి లయన్ సంగు జానయ్య, చార్టెడ్ ప్రెసిడెంట్ లయన్ గంజి యాదగిరి, కొత్త అంజిబాబు, చేనేత పరిరక్షణ సేవాసమితి అధ్యక్షులు రాపోలు ప్రభాకర్, అన్నెపర్తి యాదగిరి , రాపోలు జగదీష్ , కడారి ఆంజనేయులు, ఆస్కానీ శ్రీను, సంగెపు శ్రీనివాస్, ఏలే శ్రీనివాస్ , పెద్దబోయిన శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love