ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ

నవతెలంగాణ – భిక్కనూర్
 మండలంలోని జంగంపల్లి, పెద్దమల్లరెడ్డి, రామేశ్వర్ పల్లి, బస్వాపూర్, లక్ష్మీ దేవునిపల్లి గ్రామాలకు చెందిన బాధితులకు గురువారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలను ఆదుకుంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, జిల్లా ఎన్నారై సెల్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love