విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ 

నవతెలంగాణ- పెద్దవంగర:

మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు యూత్ ఫర్ సేవా వరంగల్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఎన్ఎంఎంఎస్ స్టడీ మెటీరియల్స్ గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బుదారపు శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలకు దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. సర్కారు పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజలింగం, సదయ్య, టకీ పాషా, అంజయ్య, యాకయ్య, విజయ్ కుమార్, శ్రీధర్, సువర్ణ, కరుణ, హైమ, గౌరీ శంకర్, షౌకత్ అలీ, వెంకన్న, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Spread the love