Monday, September 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీలో ఏకరూప దుస్తుల పంపిణీ 

అంగన్వాడీలో ఏకరూప దుస్తుల పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండలంలోని రెడ్డిపేట అంగన్వాడీలో కిశోర బాలలకు ఏకరూప దుస్తులను స్థానిక సర్పంచ్ నాగులపల్లి రాజేందర్, ఉప సర్పంచ్ బుర్ర ప్రవీణ్ గౌడ్ తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ… అంగన్వాడీల ద్వారా కిషోర బాలలకు పౌష్టికాహారంతో పాటు, ఆడుతూ పాడుతూ ఫ్రీ ప్రైమరీ విద్య, అందుతుందని, విద్యార్థులకు ఏకరూప దుస్తువులను ప్రభుత్వం అందజేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో వీడీసీ లక్కాకుల నర్సింలు, పంచాయతీ కార్యదర్శి సంజీవ్, అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి, సిబ్బంది, తల్లిదండ్రులతోపాటు కిషోర్ బాలలు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -