ప్రభుత్వ పాఠశాలలో ఏకరుప దుస్తువుల పంపిణీ..

నవతెలంగాణ – మోపాల్

బుధవారం రోజున మోపాల్ మండలంలోని మంచిప్ప గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్య పుస్తకాలను  నోట్ బుక్స్ ను విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. పాఠశాలలో ముందుగా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు సరస్వతి విగ్రహానికి పూజలు పూజలు చేసిన అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది .ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గేమ్ సింగ్  మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వసతులను సమకూర్చి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించుటకు కృషి చేస్తుంది, గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ ఆలోచించాల్సిందే ఏమనగా ప్రభుత్వ పాఠశాలలో మంచే శిక్షణ తీసుకొని ఎంపికైన ఉపాధ్యాయులు ఉన్నారు ప్రభుత్వం కూడా అన్ని వసతులు సమకూరుస్తుంది ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులు వినియోగించుకొని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే జాయిన్ చేస్తే ఆర్థికంగా మరియు మంచి నాణ్యమైన విద్యను పొందుటకు అవకాశం ఉంటుంది కాబట్టి గ్రామ ప్రజలందరూ ఆలోచించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాల్సిందిగా కోరుకుంటున్నామన్నారు, గ్రామంలోని అభివృద్ధి కమిటీ మరియు కుల సంఘాలు యువజన నాయకులు ప్రజలందరూ ఆలోచించి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలి అన్నారు, మేము మన పిల్లలకు చదువు చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రయత్నించండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వీడిసి అధ్యక్షులు నరేష్ ,కార్యదర్శి దేవదాస్, సాయిరాం, రాజేష్, సత్యనారాయణ, శ్రీనివాస్ మరియు గ్రామాభివృద్ధి కమిటీ మెంబర్స్ ఉపాధ్యాయులు సాయిలు, శ్రీనివాస్, పరమేశ్వర్, రేవతి, కరుణ మరియు పిటి దేవేందర్ గారు పాల్గొన్నారు.

Spread the love