కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఈతాపరాములు

నవతెలంగాణ – వలిగొండ రూరల్: మండల పరిధిలోని సుంకిశాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శుక్రవారం ఈతాప రాములు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో భూముల రిజిస్ట్రేషన్ విషయంలో ఎమ్మార్వోలే పెత్తనం చేసేవారని కానీ రైతులు ఎవరు నేరుగా ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లలేక పోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పాత పద్ధతిని కొనసాగించడం చాలా సంతోషకరం అన్నారు. వీఆర్వోల ద్వారా నేరుగా రైతులు ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్ళవచ్చునని, వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చునని అన్నారు.పట్టా భూములు పోరంబోకు భూములు సీలింగ్ భూముల మీద వీఆర్వోలకి అవగాహన ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాత పద్ధతిని తీసుకురావడం వల్ల రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు.

Spread the love