మహిళ శక్తి కార్యక్రమం పై జిల్లా స్థాయిలో శిక్షణ..

నవతెలంగాణ – డిచ్ పల్లి
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నిజామాబాద్ జిల్లా లోని అన్ని మండలాల సిబ్బంది, టి-సెర్ప్  డిఅర్ డిఎ ద్వారా నిర్వహిస్తున్న మహళాశక్తి కార్యక్రమ మార్గదర్శకలు, వివిధ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం శనివారం మండల కేంద్రంలోని ట్రైజం సెంటర్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఅర్ డిఎ డిఅర్ డిఎ పిడి సాయగౌడ్ పాల్గొని మాట్లాడుతూ.. మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడానికే “మహిళాశక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాట్లు తెలిపారు. వడ్డీ వ్యాపారులు, మైక్రొఫైనన్స్ సంస్థల వేదింపుల నుండి మహిళలకు విముక్తి కల్పించి మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయగానికి ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల బిజినెస్ మోడళ్ళను సూచించారు. మహిళాశక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టరేట్, బస్టాండ్, ఆసుపత్రులు జనసంచారం అధికంగా ఉన్నా ప్రదేశాలలో ఏర్పాట్లకు అనువైన అదేశాలలో మహిళాసంఘం సభ్యులతో నిర్వహించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 37 మీ సేవా కేంద్రలు, ఆధార్ అప్ డేట్స్, మొబైల్ కు లింక్ తదితర అవసరాలకు మీసేవా కేంద్రాల నిర్వహణ కూడా మహిళలకు అప్పగించడం జరిగిందని తెలిపారు. మహిళాశక్తి కార్యక్రమం లో బాగంగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో జిల్లా స్థాయిలో నిర్విహించే వివిధ రకాల సమావేశాలకు, ఇళ్లలో జరిగే శుభకార్యాలు, అశుభకార్వాలు నిర్వహణ ఈవెంట్ మేనేజ్ మెంట్  మహిళలు ఆర్థికాభివృద్ధి సాంధించవచ్చని వివరించారు.ఇవే కాకుండా సోలార్ విద్యుత్ యూనిట్ల ఏర్పాటు, నిర్వహణ ద్వారా పౌల్ట్రీ వ్యాపారాల మహిళలు ఆర్థికంగా ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. జులై ఒకటి నుండి 31  వరకు మహిళాశక్తి మాసోత్సవం ను అందరవు కలిసి చివరి నాటికి వివో ల జనరల్ బాడీ ల నిర్వహణ, ఎంఎస్  జనరల్ బాడీ ల నిర్వహణ, బ్యాంకు లింకేజ్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. సోషల్ మోబైలిజేషన్ లో భాగంగా ఎస్ హెచ్ జి లలో పదిమంది సభ్యుల కన్నా తక్కువ ఉన్నా సంఘాలలో కొత్త వారితో భర్తీ చేయడం, నూతన ఎస్ హెచ్ జి ఓ ల ఏర్పాటు కూడా చేయాలని పేర్కొన్నారు.
మహళా శక్తి కార్యక్రమం లో బాగంగా అర్హత కలిగిన, సక్రమంగా నిర్వహించగల సామర్ధ్యం కలిగిన మహిళా సభ్యులను గుర్తించి గ్రౌండింగ్ చేయడం ద్వారా ఈ కార్యక్రమం సమర్ధవంతంగా నిర్వహించి మహళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడ వచ్చని తెలిపారు. రాబోయే  5 సం,, లలో ఒక లక్ష కోట్లను ఎస్ హెచ్ జికు లింక్ చేయాలి.ఇందులో 25 వేల కోట్లు వ్యాపారాభివృద్ధి కోసం వినియోగించుకోవాలని, మహిళలను కోటీశ్వరులుగా తయారు  చేయాలని, సంఘాలలో లేని మహిళలను సంఘాలలో చేర్పించాలని,వి ఎల్ అర్ గుర్తించాలని, ప్రతి మహిళా సంఘ సభ్యురాలికి 2 లక్షల భీమా సౌకర్యం (స్త్రీనిధి),ప్రతి మహిళా సంఘ సభ్యురాలికి ప్రమాదవశాత్తు  భీమా 10 లక్షలు,వ్యాపారంనకు సంబంధించి నైపుణ్యాలను, మార్కెటింగ్, బ్రాండింగ్ డెవలప్ చేయడానికి,అమ్మ ఆదర్శ పాఠశాలలో  వి.ఓ ప్రెసిడెంట్ ద్వారా స్కూల్ బిల్డింగ్ రిపేర్లు చేయించడం, మౌళిక సదుపాయాలకు సంబంధించిన పనులు చేయించడం స్కూల్ యూనిఫామ్స్, అంగన్వాడి పిల్లల యూనిఫామ్స్ ,ఇతర ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల యూనిఫామ్స్ ను స్వయం సహాయక సంఘ మహిళల ద్వారా కుట్టించడం, డ్వాక్రా బజార్లు ద్వారా మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం, మీసేవా సెంటర్లు (బ్యాంకింగ్ జనరల్ లావాదేవీలు,ఎస్ హెచ్ జి ఆర్ధిక లావాదేవీలు),జిల్లా కు ఒక క్యాంటీన్ (ప్రభుత్వ ఆసుపత్రి ) మహిళలచే నిర్వహించడం,పుడ్ సెక్టార్/ నాన్ ఫాం సెక్టార్ లో మహిళలను మొత్తం 11 లక్షల మందిని మహిళా శక్తి పరిధిలోకి తీసుకురావాలని, సర్వీస్ సెక్టార్ లలో బ్యాంకు మిత్ర, పశుమిత్ర, కృషి మిత్ర లను గుర్తించి శిక్షణ ఇచ్చి సంబంధిత రంగాలను నిర్వహించేలా చేయడం జరిగుతుందని పిడి సాయగౌడ్ వివరించారు. ఈ సమావేశంలో అడిషనల్ డి ఆర్ డి ఓ రవీందర్, డిపిఎం ఫైనాన్స్ ఎ శ్రీనివాస్, సంధ్యారాణి, సాయలు, నీలిమా, రాచయ్య, మారుతి, అన్ని మండలాల ఎపిఎం లు పాల్గొన్నారు.

Spread the love