Tuesday, June 2, 2026
E-PAPER
Homeజాతీయంరాహుల్‌తో డీకే శివ‌కుమార్ కీల‌క భేటీ

రాహుల్‌తో డీకే శివ‌కుమార్ కీల‌క భేటీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇటీవ‌ల క‌ర్నాట‌క సీఎం ప‌ద‌వీకి సిద్ద‌రామ‌య్య రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న స్థానంలో డీకే శివ‌కుమార్ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. రేపు సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు.అదే విధంగా డీకే శివ‌కుమార్ నేతృత్వంలో కొత్త మంత్రివ‌ర్గం ఏర్పాటు కానుంది. ఆయా నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌నున్నాయి. ఈక్ర‌మంలోనే కాబోయే సీఎం డీకే శివ‌కుమార్ కాంగ్రెస్ అగ్ర‌నేత‌లతో కీల‌క భేటీ నిర్వ‌హించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం అయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు మంత్రివర్గ ఏర్పాటు, కీలక సంస్థాగత నియామకాలపై చర్చల కోసం భేటీ జ‌ర‌గ‌నుంది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి అభ్య‌ర్థుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు చేయ‌నున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -