నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని లొంగన్ జీపీ గ్రామంలో గ్రామ సర్పంచ్ నాగలగిద్దె ఉషారాణి సదు పటేల్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను గ్రామ సర్పంచ్ ఎగురవేశారు. అంతకుముందు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసీ నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిపి కార్మికులకు సన్మానించడం జరిగింది. అదేవిధంగా గ్రామంలోని పలువురు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ జిపి కార్యదర్శి అనురాధ, జిపిఓ , జిపి కార్యవర్గ సభ్యులు, మాజీ సర్పంచ్, గ్రామ పెద్దలు , మహిళా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
లొంగన్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



