ప్రాణాలు పోతున్నా..పట్టించుకోరా

– కామారెడ్డి బాన్సువాడ ప్రధాన రహదారిపై తిమ్మాపూర్ వద్ద ఏర్పడ్డ పెద్దపెద్ద గుంతలు 
– తరచూ ప్రమాదాలు
– పట్టించుకోని అధికారులు… ప్రజాప్రతినిధులు.. రాజకీయ నాయకులు 
– అగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు .. మండల ప్రజలు
నవతెలంగాణ – గాంధారి
గాంధారి నుండి బాన్సువాడ వెళ్లే ప్రధాన రహదారిలో తిమ్మాపూర్ బస్టాండ్ వద్ద రోడ్డు పైన పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి, వాహనదారులకు చాలా ఇబ్బందులు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతీ రోజు ఒకరిద్దరు ద్విచక్ర వాహనదారులు గుంతల దగ్గర రాగానే సడెన్ బ్రేక్ వేయడం, లేదా గుంతల్లో పడడం జరుగుతుంది. గత నెల రోజలుగా సుమారు 10,15 మంది ద్విచక్ర వాహనదారులు పడ్డారు. ఆదివారం ఉదయం కూడా ఒక సంఘటన జరిగింది. ద్విచక్ర వాహనంపై ధర్మరావ్ పేట నుండి పెద్ద పోతంగల్ వెళ్తున్న కుటుంబ సభ్యులు కూడా పడి, తీవ్ర గాయల పాలయ్యారు. వారిని తిమ్మాపూర్ గ్రామ వాస్తవ్యులు ఆస్పత్రికి చేరవేశారు. గ్రామ యువకులు ఈ ఘటనలు చూడలేక, కొన్ని గుంతలు మొరం నింపి, ముందు జాగ్రత్తగా రాళ్లు, కర్రలు అడ్డుగా వేశారు. అధికారులు తక్షణమే స్పందించి, మరమ్మత్తులు  చేయాలని కోరుతున్నారు.
Spread the love