Saturday, July 4, 2026
E-PAPER
Homeఖమ్మంతెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు 'దొడ్డి కొమరయ్య'

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు ‘దొడ్డి కొమరయ్య’

- Advertisement -

– సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి
– సత్తుపల్లిలో దొడ్డి కొమరయ్య వర్ధంతి
నవతెలంగాణ – సత్తుపల్లి 

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య అని సీపీఐ(ఎం) సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి అన్నారు. స్థానిక రావి వీర వెంకయ్య (ప్రజాసంఘాల) భవనంలో ఆ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి వేడుకను ఘనంగా జరిపారు. కొమరయ్య చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన వర్ధంతి కార్యక్రమంలో సత్యనారాయణరెడ్డి మాట్లాడారు. ​నిజాం నిరంకుశ పాలనకు, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కొమరయ్య చేసిన పోరాటం అజరామరమని ఆయన తెలిపారు. ​వెట్టిచాకిరి విముక్తి కోసం, రైతాంగ హక్కుల కోసం ప్రాణాలర్పించిన కొమరయ్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.

​సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన సాగించిన ఉద్యమం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పారు. ​అమరవీరుల ఆశయాల సాధన కోసం, ప్రజల హక్కుల రక్షణ కోసం నిరంతరం ఉద్యమించాలని శీలం పిలుపునిచ్చారు. ​ప్రతి ఒక్కరూ దొడ్డి కొమరయ్య త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ​ఈ వర్ధంతి కార్యక్రమంలో కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, ​ప్రజా సంఘాల నాయకులు, రావుల రాజబాబు, మోరంపూడి వెంకట్రావు, చావా రమేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -