Saturday, August 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నషా ముక్త్ ప్రతిజ్ఞ

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నషా ముక్త్ ప్రతిజ్ఞ

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి: బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “10 కోట్ల మత్తు వ్యసన రహిత ప్రతిజ్ఞ మహా ఉద్యమం”లో భాగంగా శుక్రవారం కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నషా ముక్త్ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం బ్రహ్మకుమార్ అనిల్ భాయ్ ఆధ్వర్యంలో మత్తు వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రతిజ్ఞ చేయించారు.

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “నషా ముక్త్ భారత్ అభియాన్”, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేపడుతున్న “మిషన్ స్పందన్” కార్యక్రమాలకు అనుసంధానంగా ఈ మహా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ఆగస్టు 6 నుంచి 20వ తేదీ వరకు కొనసాగుతున్న ఈ కార్యక్రమం ద్వారా మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, వ్యసన రహిత, ఆరోగ్యవంతమైన, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీలు మీనాక్షి, గంగ, సమతతో పాటు పట్టణవాసులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -