Tuesday, May 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమంచి పరిపాలన అంటే ప్రజలపై భారాలు మోపడమా?

మంచి పరిపాలన అంటే ప్రజలపై భారాలు మోపడమా?

- Advertisement -

ప్రధాని ప్రసంగంపై మంత్రి పొన్నం విమర్శ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

మంచి పరిపాలన అందించటమంటే ప్రజలపై భారాలు మోపడమేనా? అని ప్రధాని మోడీ ప్రసంగంపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. సోమవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రధానొస్తే ఎంతో లాభం జరుగుతుందని ప్రజలంతా భావించారని తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌ కు పోయిగౌరవ ప్రదంగా స్వాగతం పలికామని గుర్తు చేశారు. అభివద్ధి కార్యక్రమాల్లో సీఎం కూడా పాల్గొన్నారని తెలిపారు. కానీ..పీఎం మాత్రం పెట్రోల్‌ డీజిల్‌ వాడొద్దు..బంగారం కొనొద్దు , వంట నూనె వాడొద్దు అంటూ సుభాషితాలు వల్లించారని విమర్శించారు. ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. వేలాది కార్ల తో రోడ్‌ షో చేశారని చెప్పారు. ప్రజలకు బరోసా కల్పించాల్సింది పోయి భయబ్రాంతులకు గురి చేశారని తెలిపారు. మోడీ, అమిత్‌ షా, నడ్డా,బండి సంజరు,కిషన్‌ రెడ్డి, కాళేశ్వరం లో అవినీతి జరిగింది..బీఆర్‌ఎస్‌కు ఎటిఎంగా ఉంది, సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారని గుర్తు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ కు 12 ఏండ్లలో ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులెన్నీ, రాష్ట్ర వాటా ఎంత? అనేదానిపై చర్చకు సిద్దమా అని సవాలు విసిరారు. పక్క రాష్ట్రం వాళ్ళు ఎన్ని నిధులు అడుగుతే అన్ని తీసుకుపోతున్నారనీ, రాష్ట్ర బీజేపీ నేతలు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని నిలదీశారు. ప్రధాన మంత్రి తో సహా కేంద్ర మంత్రులను రాష్ట్రానికి కావాల్సిన అంశాలు అడుగుతుంటే వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -