– డిసెంబర్ 9 నుంచి అందుబాటులోకి
వచ్చేలా చర్యలు: మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కొహెడ సమగ్ర మార్కెట్ నిర్మాణ పనులు తుది దశలోకి చేరుకున్నాయని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు కొహెడ సమగ్ర మార్కెట్‌కు సంబంధించిన సవరించిన లేఅవుట్‌పై మార్కెటింగ్ అధికారులతో సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రైతులు, వ్యాపారులు, ఇతర భాగస్వాముల అవసరాలను దష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు రూపకల్పనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. ప్రాజెక్టును వ¶డు దశలలో పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు. తొలి దశ నిర్మాణ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి, ఈ ఏడాది డిసెంబర్ తొమ్మిదో తేదీలోగా మార్కెట్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బాటసింగారం మార్కెట్‌లో కొనసాగుతున్న లావాదేవీలను కొహెడ సమగ్ర మార్కెట్‌కు సాఫీగా తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొహెడ సమగ్ర మార్కెట్‌లో అత్యాధునిక సదుపాయాలతో ఓపెన్ ప్లాట్‌ఫారాలు, ట్రక్ డాకింగ్ షెడ్లు, డ్రైయింగ్ యార్డులు, విశాల రహదారులు, రవాణా సౌకర్యాలు, పారదర్శక లావాదేవీల కోసం సాంకేతిక వసతులు, రైతులకు అవసరమైన అన్ని సేవలను అందుబాటులో ఉంచేలా ప్రత్యేక దష్టి సారిస్తున్నామని వివరించారు. సమగ్ర మార్కెట్ ద్వారా రైతులకు తమ ఉత్పత్తులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు, మధ్యవర్తుల ప్రభావం తగ్గి, పారదర్శక మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయ రంగ అభివద్ధిలో కొహెడ సమగ్ర మార్కెట్ మైలురాయిగా నిలవాలని ఆకాంక్షించారు. మొత్తం ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయనీ, ప్రాజెక్టుకు సంబంధించిన తుది ప్రతిపాదనను ముఖ్యమంత్రికి ఆమోదం కోసం సమర్పిస్తున్నామని వెల్లడించారు.
తుది దశకు కొహెడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



