
నవతెలంగాణ – మల్హర్ రావు
అధైర్య పడొద్దు అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జి,పె ద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మదుకర్ అన్నారు. మంథని నియోజకవర్గంలోని కాసగోని రాజయ్య గౌడ్, చొప్పదండిలోని టీపీసీసీ జనరల్ సెక్రటరీ సత్తు మల్లేశం తండ్రి సత్తు నర్సయ్య లు అనారోగ్యంతో ఇటీవల మృతిచెందగా ఆదివారం పుట్ట పరమార్శించి, అధైర్య పడొద్దు,అన్నివిధాలా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. అనంతరం మృతురాలి చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.ఆయన వెంటా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.