– కాంగ్రెస్ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు
నవతెలంగాణ-మల్హర్‌రావు
బీఆర్‌ఎస్ హామీలు నమ్మి మోసపోవద్దని జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిపేస్టో చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నారు. సోమవారం మండలంలోని మల్లారం గ్రామంలో బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి దాదాపు 200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి దుద్దిళ్ల సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న ఇచ్చిన హామీలు అమలు చేయని కేసీఆర్ కొత్త హామీలతో ఓట్లు అడుగుతున్నారని మండిప డ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్య మని, పేదల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలు అమలు పక్కాగా జరు గుతున్నాయని అన్నారు. ప్రజలంతా ఎన్నికల్లో తనకు అండగా ఉండి గెలిపించాలని కోరారు. రావులపల్లిని ప్రత్యేక గ్రామపంచాయతీ,సీలింగ్ భూమికి పట్టా, ప్రభుత్వం వచ్చిన వెంటనే చేస్తా మన్నారు. అలాగే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు, కాగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, ఎంపీటీసీ ప్రకాష్‌రావు, యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాంతి, సింగిల్ విండో డైరెక్టర్ ఇప్ప మొండయ్య, వార్డు సభ్యులు లింగన్నపేట శ్రీదర్, రమేష్,రూపేస్ రావు,మహేష్, రాజేశ్వర్ రావు,మాధవ రావు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీతోనే బంగారు భవిష్యత్
కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తేనే సకల జనులకు బంగారు భవిష్యత్ ఉంటుందని మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. జాతీయ కాంగ్రె స్ కార్యదర్శి, మాజీ మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు సోమవారం మండలంలోని మల్లారం, రుద్రారం, తాడిచెర్ల, ఎడ్లపల్లి గ్రామాల్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో ఇంటింటా ఆరు గ్యారంటీలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇందుకు మంథని ఎమ్మెల్యేగా దుద్దిళ్ల శ్రీధర్ బాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. అ నంతరం కాంగ్రెస్ పథకాల గ్యారెంటీ కార్డు లను పంపిణీ చేశారు. సింగిల్ విండో డైరెక్టర్లు ఇప్ప మొండయ్య, వొన్న తిరుపతి రావు,సంగ్గెం రమేష్, సర్పంచ్ జనగామ స్వరూప బాపు, జంగిడి శ్రీనివాస్, బొబ్బిలి రాజు గౌడ్,,కేశారపు చెంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.