జూటలు మాటలు చెప్పే కాంగ్రెస్, బీజేపీ లను నమ్మొద్దు 

– ఈ సారి ప్రభాకరాన్ననే గెలిపించాలి
– గతంలో మోసపోయి గోస పడ్డాం
–  ఆకారంలో బీఆర్ఎస్ నేతల ఎన్నికల ప్రచారం 
– బీఆర్ఎస్ దుబ్బాక మండలం పరిశీలకులు యెల్లు రవీందర్ రెడ్డి
నవతెలంగాణ- దుబ్బాక రూరల్
ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి మోసం చేసే  కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మొద్దు. వచ్చే ఎన్నికల్లో దుబ్బాక గడ్డపై తిరిగి గులాబీ జెండా ఎగర వేసి మెదక్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ దుబ్బాక మండలం పరిశీలకులు యెల్లు రవీందర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి  కొత్త ప్రభాకర్ రెడ్డి తరపున దుబ్బాక మండల  బీఆర్ఎస్ నేతలు ఇంటి ఇంటికి ప్రచారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించేందుకు తమ వంతు మద్దతు ఉంటుందని పలు సంఘాల నాయకులు తెలిపారు.కార్యక్రమంలో  కోర్ కమిటి సభ్యులు ,జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, ఎంపీపీ పుష్పలత కిషన్ రెడ్డి, మండల అధ్యక్షులు బాణాల శ్రీనివాస్, ఎంపీటీసీ లక్ష్మి నారగౌడ్, ఎంపీటీసీ రాంరెడ్డి, సర్పంచ్ కాసా నాగభూషణం, మాజీ సర్పంచ్ దప్పు రత్నం రాజానర్సు, మాజీ ఎంపీటీసీ గడ్డం లక్ష్మి నర్సవ్వ సద్ది రాజిరెడ్డి,శ్రీనివాస్, కోపరేటివ్ డైరెక్టర్ బాలిరెడ్డి గ్రామ అధ్యక్షులు పాక రాజు, బూతు అధ్యక్షులు పర్శగౌడ్, బీమరా స్వామి,మూర్తి కరుణాకర్ రెడ్డి, దేశెట్టి నరేష్,గ్రామ బీఆర్ఎస్ యూత్, బీఆర్ఎస్వి  కార్యకర్తలు ఉన్నారు.
Spread the love