నవతెలంగాణ-మంగపేట
మండలంలోని ధోమెడ గ్రామంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ధోమెడ గ్రామశాఖ అధ్యక్షుడు చప్పిడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యానయ్య ముఖ్య అతిధిగా హాజరై గ్రామంలో ఇంటింటింకి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారెంటీ పథకాలపై అవగాహన కల్పించారు. గ్యారెంటీ పథకాల్లో భాగమైన మహిళలకు మహాలక్ష్మి, ఐదు వందలకు గ్యాస్, రైతు భరోసా, గహ జ్యోతి, కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఐదు లక్షల రూపాయలు వంటి అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజలకు అందిస్తుందని యానయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అచ్చయ్య, కన్నయ్య, అష్రాఫ్, రామూర్తి, శ్రీనివాస్, మిస్కీన్, సమ్మయ్య, నాగేష్, సత్యం, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.