గ్రామంలోని పారిశుధ్య పనులు చేయడంలో నిర్లక్ష్యం చేయొద్దని బి ఎల్ పి ఓ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం హుస్నాబాద్ మండలంలోని పోతారం ఎస్ గ్రామంలో పరిశుద్ధ పనులు పరిశీలించారు. వార్డులలో ని మురికి కాలువలలో చేత చదవడం లేకుండా చూడాలని, దోమల నివారణకు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎలాంటి సమస్య లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎల్లయ్య , గ్రామపంచాయతీ కార్మికులు ఉన్నారు.