Monday, September 14, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్-అమెరికా ఒప్పందంపై ఆందోళన వద్దు

ఇరాన్-అమెరికా ఒప్పందంపై ఆందోళన వద్దు

- Advertisement -

గల్ఫ్ నేతలకు నచ్చచెబుతున్న రుబియో
అబూధాబీ : అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తన మూడు రోజుల గల్ఫ్ దేశాల పర్యటనను ప్రారంభించారు. ఆయన మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత అబూధాబీ చేరుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అలీ నహ్యాన్‌తో బుధవారం సమావేశమయ్యారు. ఇరాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంపై భయాందోళనలు చెందవద్దని ఆయనకు భరోసా ఇచ్చారు. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు పూర్తి స్థాయిలో, సురక్షితంగా ప్రయాణించేందుకు తీసుకుంటున్న చర్యలు, మధ్యప్రాచ్యంలో శాంతి-సుస్థిరతలను నెలకొల్పాల్సిన ఆవశ్యకతపై ఇరువురు నేతలు చర్చించారు. ఇరాన్ దాడుల సమయంలో ఏఈ ప్రదర్శించిన ధైర్యసాహసాలను రుబియో ప్రశంసించారు. యూఏఈ నాయకత్వం అందజేస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.

యూఏఈ పర్యటనను ముగించుకున్న రుబియో కువైట్, బహ్‌రైన్ బయలుదేరారు. అక్కడ గల్ఫ్ విదేశాంగ మంత్రులతో సమావేశమవుతారు. అనంతరం తిరిగి అమెరికా చేరుకుంటారు. అబూధాబీలో రుబియో విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్- అమెరికా ఒప్పందంపై గల్ఫ్ దేశాల అభిప్రా యాలను తెలుసుకుంటానని చెప్పారు. ‘నేను మాట్లాడే దాని కంటే వారు చెప్పేదే ఎక్కువగా వింటా’ అని అన్నారు. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ ఎలాంటి రుసుము వసూలు చేయకూడదని, ఒకవేళ వసూలు చేస్తే అది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమవుతుందని తెలిపారు. అంతర్జాతీయ జలమార్గంలో ఏ దేశం రుసుములు, ఫీజులు వసూలు చేయకూడదని అంటూ ఈ విషయంలో మధ్యప్రాచ్యంలోని దేశాలన్నీ అమెరికాతో ఏకీభవిస్తాయని అనుకుంటున్నానని రుబియో చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -