మరమ్మత్తులకు నోచని కాలువలు..

– చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు 
– సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు
నవతెలంగాణ – బొమ్మలరామారం
కాలువ తెగిపోయి సంవత్సరం గడుస్తున్న  ఎలాంటి మరమత్తులకు నోచుకోకుండా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు అన్నారు. బొమ్మలరామారం మండలంలో మర్యాల గ్రామంలో సీపీఐ(ఎం) పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. షామీర్ పేట  నుండి  మాచన్ పల్లి కత్వ నుండి కాల్వ ద్వారా ఈదుల చెరువు లోకి రావడం జరుగుతుంది. మాచన్ పల్లి నుండి వచ్చే కాలువ తెగిపోయి సంవత్సరం గడుస్తున్న గతంలో అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా ప్రభుత్వ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వల్ల చెరువులోకి నీళ్లు రాక గ్రౌండ్ వాటర్ సాగునీరు లేక మత్స్య కారును ఉపాధి కూలిపోయి ఇబ్బంది పడుతున్నారని, సుమారుగా 100 మంది మత్స్య కారులు ఉన్నారని. అదేవిధంగా రైతు కుటుంబాలు 100 కుటుంబాకు ఉంటాయని  రోడ్డు మీద పడ్డారని సుమారు 450 ఎకరాల భూమి  బీడుగ మారిందని అన్నారు .రాష్ట్ర ప్రభుత్వాలు మారిన సాగునీరు కాలువలకు సమస్యలు పరిష్కారం కాలేదని ఇప్పటికైనా తెగిపోయిన కాల్వకు బడ్జెట్ కేటాయించి మరమ్మతులు చేపట్టి కాలువలు బాగు చేయాలని చెయ్యని యెడల రైతులను ప్రజలను సమీకరించి ఇరిగేషన్ ఆఫీస్ ముట్టడిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి ర్యకలశ్రీశైలం ,గ్రామ శాఖ కార్యదర్శి ముద్దం మధు, దేశెట్టి సత్యనారాయణ, బండ సత్యనారాయణ, రైతులు ప్యారారం, మల్లేష్, మంద రాజు, మచ్చ కృష్ణ, బండ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love