Thursday, June 4, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టు

సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టు

- Advertisement -

రూ.6.5 కోట్ల ముడి పదార్థాలు సీజ్
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి

సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోరి ఓ ఫామ్‌హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఓ అంతరాష్ట్ర డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని మహారాష్ట్ర పోలీసులు బుధవారం చేధించారు. కోహీర్ మండలం పీచేర్యాగడి తండాలో ఉన్న 2 ఫామ్ హౌస్‌ల్లో ఈ డ్రగ్స్ ఫ్యాక్టరీ నడుస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో ముంభై నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసుల బృందం ఈ ఫామ్‌హౌస్‌పై మెరుపు దాడి చేసింది. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున ల్యాబ్ తరహా ఏర్పాట్లు చేసి డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు బయటపడింది. ఈ దాడిలో సుమారు 3 కిలోల ప్రమాదకర ‘మెఫెడ్రోన్‌’ డ్రగ్స్‌తోపాటు దాని తయారీకి ఉపయోగించే భారీ పరిమాణంలో ముడిపదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఈ ముడిపదార్థాల విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.6.5 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డ్రగ్స్ తయారీకి కావాల్సిన ముడి పదార్థాలను ఈ ముఠా ముంబై నుంచి రహస్యంగా తరలించినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న సంగారెడ్డి గ్రామీణ ప్రాంతంలోని ఫామ్ హౌస్‌ను నిందితులు సేఫ్ ప్లేస్‌గా ఎంచుకున్నారు. ఇక్కడే ల్యాబ్ ఏర్పాటు చేసి డ్రగ్స్ తయారు చేస్తూ.. వాటిని తిరిగి ముంబైతోపాటు దేశంలోని ప్రధాన నగరాలకు సరఫరా చేస్తున్నట్టు సమాచారం. ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ తయారు చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ముగ్గురు నిందితులను మహారాష్ట్ర పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. అనంతరం, పట్టుబడిన డ్రగ్స్, ముడి పదార్థాలను సీజ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -