సిగరెట్టు ప్యాకెట్లలో డ్రగ్స్‌

in cigarette packets Drugs– బొల్లారం పీఎస్‌ఎన్‌ మెడికేర్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌లో అధికారుల సోదాలు
– రూ.9 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత
– ముగ్గురి అరెస్ట్‌
నవతెలంగాణ – ఐడిఏ బొల్లారం
సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రామికవాడలో డ్రగ్స్‌ కలకలం రేపింది. పారిశ్రామిక వాడలోని పీఎస్‌ఎన్‌ మెడికేర్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమలో శుక్రవారం ఇంటర్‌ పోల్‌ సమాచారంతో అధికారులు దాడులు చేపట్టారు. పరిశ్రమలో డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ.9 కోట్ల రూపాయల విలువ చేసే 90.48 కిలోల మేపిడ్రీన్‌ డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పదేండ్ల నుంచి ఈ డ్రగ్‌ను తయారు చేసి విదేశాలకు తరలిస్తున్నట్టుగా అధికారుల పరిశీలనలో తేలింది. ఈ వ్యవహారానికి సూత్రధారులైన సత్యనారాయణ రెడ్డి, సుధాకర్‌ రెడ్డి, కస్తూ రి రెడ్డిని డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు అరెస్టు చేశారు. సిగరెట్టు ప్యాకెట్లలో పెట్టి విదేశాలకు డ్రగ్స్‌ను తరలిస్తున్నట్టు గుర్తించారు. ఇందులో కొంత వరకు హైద రాబాద్‌ నగరంలో కూడా సప్లై అవుతున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love