భూపాలపల్లి జిల్లా కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి కాటారం పోలీస్ డిఎస్పీ ఛాంబర్ లో శనివారం యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ (యు,ఎఫ్) 2025 నూతన సంవత్సర క్యాలెండర్, ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడారు పాలనలో పారదర్శకత అధికారులు జవాబుదారు ఉండాలని, అవినీతి లేని సమాజం నిర్మించాలని సమాచార హక్కు చట్టం ప్రజల చేతులు వజ్రాయుధంగా పనిచేస్తుందని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అవినీతి ఎక్కడ జరిగిందో సమాచార హక్కు చట్టం ద్వారా సాధ్యమవుతుందని తెలిపారు.యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ కాటారం సబ్ డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ మాట్లాడుతూ పాలనలో పారదర్శకత,అధికారులు జవాబిదారితనంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్టీఐ సభ్యులు భూడిద రాజ సమ్మయ్య,గోగు రామస్వామి,దుర్గం సాగర్,పాగే సుధాకర్ పాల్గొన్నారు.