నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి పోలీస్ స్టేషన్ ను భువనగిరి డిసిపి బి రవీందర్ యాదవ్ సందర్శించి పోలీస్ స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ విధానం ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే పిటిషనర్లతో రిసెప్షన్ అధికారి, సిబ్బంది స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా మాట్లాడినప్పుడే ఫిర్యాదుదారులు సంతృప్తి చెందడంతో పాటు పోలీస్ శాఖపై గౌరవ భావం పెరుగుతుందని సూచించారు. ప్రజలకు త్వరితగతిన, పారదర్శకంగా సేవలు అందించాలని ఆదేశించారు.
పోలీస్ స్టేషన్‌లోని అన్ని రికార్డులు మరియు ఫైల్స్‌ను “5S విధానం” ప్రకారం క్రమబద్ధంగా నిర్వహించాలని, స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా మరియు శుభ్రమైన వాతావరణంలో ఉంచాలని సూచించారు. రికార్డులు, ఫైల్స్ నిర్వహణపై ప్రత్యేకంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్శనలో భువనగిరి రూరల్ ఎస్ హెచ్ ఓ ఎం అనిల్ కుమార్, ఎస్ ఐ పి కె శివ శంకర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



