నవతెలంగాణ -పెద్దవూర
ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను, సంక్షేమ పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా డీటీడీఓ రాజ్ కుమార్ విద్యార్థులకు సూచించారు. బుధవారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రం లోని ఆశ్రమ పాఠశాల గిరిజనవసతి గృహాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈసందర్బంగా పాఠశాల, వసతి గృహ రికార్డులను, తరగతి గదులు, భోజన హాలు వంటగదులు, పరిశీలించి విద్యార్థులును వివరాలు, హాస్టల్ విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులను పర్యవేక్షించారు. విద్యార్థులకు వండిన ఆహార పదార్థాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన శిక్షణతోపాటు భోజనం అందించే బాధ్యత వార్డెన్లదేనని పేర్కొన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులకు దూరంగా ఉండి విద్యను అభ్యసించడానికి వస్తున్నారని అందుకు ప్రభుత్వం అందించే అన్ని సుదుపాయాలను వారికి అందజేయాలన్నారు. భోజనానికి సంబంధించిన రోజువారీ మెనూ సూచిక పాటించాలని సిబ్బందికి సూచించారు. వంట గది పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన తెలిపారు. అదేవిధంగా పదవ తరగతి లో అత్యధిక జిపిఏ సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. ఈయన వెంట జిల్లా ఏటీ డబ్ల్యూఓ లక్ష్మారెడ్డి, ప్రిన్సిపాల్ బాలాజీ నాయక్, వార్డెన్ బాలకృష్ణ, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాంరెడ్డి, షబ్బీర్, సురేందర్ రెడ్డి, సైదులు, రామయ్య, సంధ్య, శాంతి, శాహీన్ బేగం, తదితరులు వున్నారు. వార్డెన్లు బాలకృష్ణ, సంధ్యరాణి, రమేష్, సిబ్బంది వున్నారు.