పోచారం ప్రాజెక్టు కాలువలో బాతులు..

– దొరికింది తినేద్దాం..
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
ఆకలితో ఉన్న జీవికి ఆహారం దొరికితే ఆనందం వేరే ఉంటుంది. అదేవిధంగా వరంగల్ నుండి నాగిరెడ్డిపేట మండలం మీదుగా వలస వెళ్తున్న బాతులకు అదే కనిపించింది. ఉన్నట్టుండి బురద నీరు కనబడడంతో ఆ బురదలో తమకు కావాల్సిన ఆహారాన్ని వెతకడంలో బిజీ అయిపోయాయి బాతులు. వరంగల్ నుండి నాగిరెడ్డిపేట మీదుగా వెళుతున్న వలస బాతులకు పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ అయినటువంటి గోలి లింగాల్ చీనూరు గ్రామాలను  ఆనుకొని పారుతున్న పోచారం ప్రధాన కాలువ కనిపించడంతో ఉన్న బురద నీటిలో చిన్న చిన్న చేపలు, పురుగులు, దొరుకుతాయని బాతులు  తిండి వేట కొనసాగించాయి. వందలాది బాతులు ఆ బురదలో వేటాడుతుంటే పాదాచారులు అదృశ్యాన్ని తిలకిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

Spread the love