– బీఆర్‌ఎస్ ఫేక్ విడియోపై కాంగ్రెస్ మండిపాటు
నవతెలంగాణ-మల్హర్ రావు
నీతికి,నిజానికి మారుపేరు జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబుని భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షుడు దండు రమేష్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య అన్నారు.శనివారం మండల కేంద్రములో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు పేద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మధు తోపాటు తన అనుచరులు ఇటీవల ఓ పెక్ వీడియో సష్టించడంపై వారు మండిపడ్డారు. చెల్పూర్ జెన్కో కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాట మంథని నియోజకవర్గంలోని కాటారంలో ఏర్పాటు చేయాల్సి ఉండగా, అట్టి ప్లాంటును రూ.400 కోట్ల స్కామ్ చేసి పక్క నియోజకవర్గం అయిన భూపాలపల్లికి మంత్రి హౌదాలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు తరలించారనడం పూర్తిగా ఆవాస్తామని,దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరుపున ఖండిస్టున్నట్లుగా చెప్పారు.వరంగల్ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయించిన చెల్పూర్ లో జెన్కో సంస్థ కేటిపిపి మొదటి విడత 500 మేఘావాట్ల విద్యుత్ ఉత్పాదక కేంద్రమన్నారు.ఇది తెలియని బిఆర్‌ఎస్ నాయకులు అవాస్తాలు సష్టించడం సిగ్గుచేటన్నారు.చెల్పూర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ముందు ప్రభుత్వం, జెన్కో సంస్థ కానీ కాటారంలో థర్మల్ విద్యుత్ ఉత్పాదక కేంద్రం ఏర్పాటు కొరకు కనీస ఆలోచన కుడా చేయలేదన్నారు. తమ నాయకుడు శ్రీదర్ బాబు మచ్చలేని నాయకుడన్నారు. .దుద్దిళ్ల కుటుంబంపై బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్న వాళ్ళమీద,ఈ ఫేక్ వీడియో మీద పోలీస్ అధికారులు విచారణ చేసి ఈ ఫేక్ వీడియో క్రియేటివ్ చేసిన వాళ్ళను గుర్తుంచి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఐత రాజిరెడ్డి, ఇందారపు చెంద్రయ్య, కేశారపు చెంద్రయ్య, యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాంతి, ఇందారపు ప్రభాకర్, బూడిద రాజా సమ్మయ్య, దుర్గాప్రసాద్, సతీష్,మొగిలి పాల్గొన్నారు.