మంథని నియోజక వర్గంలో దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సుడిగాలి పర్యటన

– నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ – మంథని
మంథని నియోజకవర్గం లోని పలు మండలాల్లో రాష్ట్ర ఐటి పరిశ్రమల శాసనసభ వ్యవహార శాఖ మంత్రి దుద్దిల్ల.శ్రీధర్ బాబు సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.నియోజకవర్గంలో శ్రీధర్ బాబు చేపట్టిన పలు కార్యక్రమాలకు ప్రజలు,పార్టీ నాయకులు,అభివృద్ధి పనులకు సంబంధించిన వివిధ సంబంధిత అధికారులు పెద్ద ఎత్తున హాజరైనారు.మల్హర్ రావు మండలం లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి,శంకుస్థాపనలు చేశారు. మల్లారం గ్రామంలో 2 కోట్ల5 లక్షల రూపాయలతో నిర్మించిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా పాలనాధికారి భవేశ్ మిశ్రాతో కలిసి ఆయన ప్రారంభించారు.మల్లూరు గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని,తాడిచర్ల గ్రామంలో ఆర్ అండ్ ఆర్ కాలనీలో 16 లక్షల రూపాయలతో నిర్మించనున్న అంగన్వాడి కేంద్రానికి,4 కోట్లతో చేపట్టనున్న విద్యుదీకరణ పనులకు,తాడిచర్ల నుండి గోపాల్పూర్ వరకు 40 లక్షలతో చేపట్టిన రహదారి నిర్మాణ పనులకు 23 లక్షలతో నిర్మించనున్న అంతర్గత రహదారి నిర్మాణ పనులకు శ్రీధర్ బాబు శంకుస్థాపనలు చేశారు.తాడిచర్ల గ్రామంలో 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.రూ.71 లక్షల వ్యయంతో నిర్మించిన తాడిచర్ల నూతన తాహసిల్దార్ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు.గ్రామంలో 30 లక్షల 20వేల రూపాయల విలువగల చేపల విక్రయ ఆటోలను అలాగే 19.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న వైద్యాధికారి నివాస భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన అనంతరం అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందన్నారు. ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా నీటిపారుదల శాఖ అధికారులు కట్టు దిట్ట మైన చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లో పథకాలను అమలు చేస్తామని చెప్పాం,కానీ 48 గంటల్లోపే పథకాలను అమలు చేయడం ప్రారంభించామని తెలిపారు.ఇల్లు లేని పేదవారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించామని అన్నారు.బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం రాజీ పడకుండా ముందుకు సాగుతామని, అన్ని వర్గాల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేశామాన్నారు. ఇచ్చిన మాటనునిలబెట్టుకోవడానికి గత మూడు నెలలుగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్న,ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సహచర మంత్రులమంతా కృషి చేస్తున్నామన్నారు. కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారని,బంగారు తెలంగాణ చేస్తా అన్న కేసీఆర్,ప్రజలకు మీరు ఏం చేశారో చెప్పాలన్నారు. డ్యాములు అయనే కడతాడు,మనుషులకు ఆపరేషన్లు ఆయనే చేస్తానడం విడ్డూరమన్నారు.ప్రాజెక్టులో నీళ్లు నిలువ ఉండకూడదని చెప్పింది మేము కాదని,కేంద్ర ప్రభుత్వం నియమించిన డ్యామ్ సేఫ్టీ అధికారులు నీళ్లు ఉండకూడదు అని చెప్పారన్నారు. ప్రకృతి వైపరీత్యంతో సెప్టెంబర్,అక్టోబర్ మాసాల్లో వర్షాలు కురవలేదని,భూగర్భ జలాలు తగ్గిపోవడానికి ఇది ఒక కారణమని ఆయన అన్నారు.ఆ సమయంలో బారసా ప్రభుత్వం అధికారంలో ఉందని,త్రాగునీటికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చివరికి ఇబ్బంది కలగకుండా చూడడానికి ప్రయత్నిస్తున్నాం చేస్తున్నమన్నారు.కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారని,రాబోయే పార్లమెంటులో ఎన్నికల్లో టిఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలన్నారు.బిజెపి,బిఆర్ఎస్ పార్టీలు ఏటీం,బీటీంలుని ఇరు పార్టీలు పది సంవత్సరాలు చెట్టా పట్టాలు వేసుకుని నడిచారన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజాపతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Spread the love