“ఇనుముల”కు మంత్రి అభినందన

నవతెలంగాణ – మంథని
బహుజన సాహిత్య అకాడమీ వారిచే జాతీయ సేవారత్న అవార్డు, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం గౌరవ హైకోర్టులో అడ్వకేట్ ప్రాక్టీస్ కొరకు బార్ కౌన్సిల్ ఎన్ రోల్, ప్రతిజ్ఞ చేసి ఇచ్చిన ధృవీకరణ పత్రం పొందిన సందర్భంగా మంథనికి చెందిన డీసీసీ అధికార ప్రతినిధి, మీడియా కన్వీనర్ ఇనుముల సతీష్ ను శుక్రవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అభినందించారు. హైదరాబాదులోని సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును తన చాంబర్ లో నతీష్ కలిసి దీవెనలు, ఆశీన్సులు తీసుకోగా మంత్రి శ్రీధర్ బాబు నతీష్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపి భవిష్యత్తులో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.
Spread the love