
వాగులో చిక్కుకొని దుక్కిటద్దు మృతి చెందిన సంఘటన దామెరవాయి లోని సింగారం వాగులో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామెరవాయి గ్రామానికి చెందిన ఆదివాసి గిరిజన రైతు కుర్సం రమేష్ సింగారం భాగవత ఆయన భూమిలో దుక్కి దున్ని రెండు ఎద్దులను వదిలిపెట్టాడు. అందులో ఒక్కేద్దు ఇంటికి చేరుకుంది, మరో ఎద్దు వాగు ఉధృతికి కొట్టుకుపోయి, అందులో నే చిక్కుకొని సుమారు 50 వేల రూపాయల విలువచేసే దుక్కిటేద్దు మృతి చెందింది. ఆ రైతు అతని భార్య ఎద్దు వద్దకు వెళ్లి, బోరున విలపించారు. వర్షాకాలం ఆసన్నమైంది కాబట్టి ఇంకో ఎద్దు కొనుక్కోవడానికి పైసలు లేని నిరుపేద ఆదివాసి గిరిజన రైతుకు ఐటీడీఏ తక్షణమే ఆదుకొని నష్టపరిహారం కట్టించాలని ఆదివాసి సంఘాలు నాయకులు, గ్రామస్తులు కోరుతున్నారు.