నవతెలంగాణ – నసురుల్లాబాద్
కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురవడంతో బాధ్యులపై ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా దుర్కి కల్లు డిపోను మంగళవారం సీజ్ చేశామని బాన్స్వాడ ఎక్సెస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యాదగిరి తెలిపారు. దుకాణంలో ఉన్న 840 లీటర్ల కల్తీ కల్లును స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను గుర్తించి 5 సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశామన్నారు. ప్రధాన నిందితుడు దుర్కికల్లు డిపో యజమాని సురేందర్ గౌడ్ పరారీలో ఉన్నాడని, సురేందర్ గౌడ్ తండ్రి లక్ష్మాగౌడ్ ను పోలీసులు అరెస్టు చేశామన్నారు. ఈత, తాటి చెట్టు ఎక్కలేని నాయకులకు గీత కార్మిక లైసెన్స్ ఇచ్చి కల్తీకల్లు సహకరిస్తున్న ఏక్సైజ్ అధికారులు కొందరు వారు ఇచ్చే ముడుపులకు ఆశపడు తున్నారు. కల్తీ కల్లు సరఫరా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా, చెట్టు ఎక్కి స్వచ్ఛమైన కళ్ళు అమ్ముకుంటూ జీవిస్తున్న తమకు అక్రమంగా అరెస్టు చేసి బాన్సువాడ ఎక్సెస్ ఆఫీసుకు తీసుకువచ్చారంటూ కొందరు గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. చెట్లు ఎక్కలేని వారు కల్తీకల్లు సరఫరా చేస్తూన్న వారికి కొందరు లైసెన్స్ ఇవ్వవగా, లైసెన్సు ఇవ్వని వారిని అదుపులో తీసుకొని విచారించడం ఏమిటి అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక గీత కార్మికులపై అధికారులు జులుం చెయ్యడం ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు.