మెగా డీఎస్సీ నిర్వహించాలి: డీవైఎఫ్ఐ

– గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలి: జిల్లా అధ్యక్షులు వర్ధం సైదులు
నవతెలంగాణ – అచ్చంపేట 
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా చొరవ తీసుకొని  గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచి నిరుద్యోగ యువతీ యువకులను ఆదుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వర్ధo సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు .ఉద్యోగ నియామకాలపై జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, ప్రభుత్వం ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలను సంబంధించిన విధివిధానాలను ప్రకటించాలని కోరారు.  25.వేల డీఎస్సీ పోస్టులను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులని పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇస్తానన్న 4.వేల రూపాయలు నిరుద్యోగ భృతిని తక్షణమే చెల్లించాలని,  ఉద్యోగ నియమాల విషయంలో గత ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయిన నిరుద్యోగ యువతీ యువకులకు కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని చూపెట్టాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది యువతీ యువకులు ఉన్నత విద్య వంతులు ఉన్న సరైన విద్య ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,  వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని కోరారు.
Spread the love