Thursday, May 28, 2026
E-PAPER
Homeజాతీయంవిజయన్‌ ఇళ్లపై ఇడి దాడులు..చెన్నైలో సీపీఐ(ఎం) నిరసన

విజయన్‌ ఇళ్లపై ఇడి దాడులు..చెన్నైలో సీపీఐ(ఎం) నిరసన

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయ్‌ ‌విజయన్‌ ఇళ్లపై బుధవారం ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ దాడులు నిర్వహించింది. ఈ దాడులకు వ్యతిరేకంగా గురువారం చెన్నైలో సీపీఐ(ఎం) నేతలు, కార్యకర్తలు నిరసన చేశారు. సీపీఐ(ఎం) సెంట్రల్‌‌ చెన్నై జిల్లా కార్యదర్శి జి సెల్వా ఇడి దాడులను తీవ్రంగా ఖండించారు. ఇడి దాడులను, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి అరెస్టును తమిళనాడు టివికె ప్రభుత్వం ఖండించాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలకు వ్యతిరేకంగా ఇడి, సిబిఐ దర్యాప్తు సంస్థలను ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలు ఉపయోగిస్తున్నాయి సెల్వా ఆరోపించారు. హడావిడిగా సోదాలు నిర్వహించిన ఇడి అధికారులకు విజయన్‌ ఇళ్లలో ఒక్క పత్రం కూడా లభించలేదు. ఈ విషయాన్ని ఇడినే స్వయంగా ప్రకటించింది. పినరయ్‌ ‌విజయన్‌ ఇళ్లపై ఇడి చేసిన దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. వామపక్ష పార్టీలకు, అందునా సీపీఐ(ఎం)పై రాజకీయ కక్ష సాధించపు చర్యల్లో భాగంగానే ఈ ఇడి దాడులు జరిగాయి అని సెల్వా మీడియాతో అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -