కాంగ్రెస్ లో చేరిన ఈగ గంగారెడ్డి

నవతెలంగాణ – మోపాల్ 

మాజీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి సమక్షంలో ఆదివారం రోజున కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. బోర్గం (పి) లో ఆదివారం రోజున పార్లమెంట్ ఎన్నికలు భాగంగా గంగిరెడ్డి తోపాటు కొంతమంది బిఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ లో చేయడం జరిగింది. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ బోర్గం (పి) నిజామబాద్ రూరల్ లోని పెద్ద గ్రామం అని దీని కార్పొరేషన్ లో కలపకుండా చాలా కష్టపడ్డాను అని కోటి వరకు వెళ్లాలని కానీ అనేక కారణాల వల్ల ఇది కార్పొరేషన్ లో కలిసి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఇది చాలా పెద్ద గ్రామపంచాయతీ దీని ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రామ పంచాయతీ ఆదాయం ఈ గ్రామ పంచాయతీకి వినియోగిస్తే జిల్లాలోనే అత్యుత్తమ గ్రామంలో ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు పార్లమెంట్ లో కొట్లాడి దీని స్మార్ట్ సిటీగా ఏర్పాట ఏ విధంగా చూస్తానని అలాగే బోధన్ బీదర్ లేని కూడా ఏర్పాటు చేస్తానని కచ్చితంగా నేను గెలిచిన వెంటనే షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించే విధంగా కష్టపడతానని ఆయన తెలిపారు. భూపతి రెడ్డి మరియు నేను కలిసి నిజాంబాద్ రూరల్ నియోజకవర్గం అత్యధికంగా అభివృద్ధి చెందే విధంగా చూస్తామని అలాగే నియోజకవర్గానికి ఒక బైపాస్ రోడ్డు కూడా వేసే విధంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పాటు పడతానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ నగేష్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముప్పగంగారెడ్డి ,టి పి సి డెలిగేట్ శేఖర్ గౌడ్, డిసిసిబి బ్యాంక్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, మోపాల్ మండల అధ్యక్షుడు సాయి రెడ్డి, సందగిరి భూమ్ రెడ్డి ,ఈగ రమేష్ రెడ్డి, సడక్ శేఖర్ రెడ్డి, విక్రం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love