మెపా రాష్ట్ర స్థాయి సమావేశం లో నూతన కార్యవర్గం ఎన్నిక..

– రాష్ట్ర అధ్యక్షులుగా పులి దేవేందర్ ఎన్నిక..
నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
మేప రాష్ట్ర కార్యవర్గ కార్యవర్గ సమావేశాన్ని కోఠి లోని హనుమాన్ టెక్డి లోని బీసీ సాధికారత భవన్ ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా మెపా  ( ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రం) నాలుగవ రాష్ట్ర స్థాయి సమావేశం మెపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ అధ్యక్షతన ఆదివారం  నిర్వహించారు ఈ సందర్భంగా  మహిళ లను, సన్మానించారు . అనంతరం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.నూతన అధ్యక్షులు గా పులి దేవేందర్ ముదిరాజ్  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .రాష్ట్ర ప్రధాన  కార్యదర్శి గా బొట్లపల్లి సంజీవన్ కుమార్ ముదిరాజ్ ను,గౌరవ అధ్యక్షులు గా బోయిని జగన్ మోహన్ ముదిరాజ్ ను ఆర్ధిక కార్యదర్శి గా కోల కరుణాకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మొత్తం 50 మంది నీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా ఎన్నుకున్నారు.అనంతరం నూతన అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ. జాతి బిడ్డలు అనేక దశాబ్దాలుగా కోట్లాడుతూ ఎదురుచూస్తున్న రిజర్వేషన్  బీసీ డీ నుండి బీసీ ఏ  సమస్య ను ప్రభుత్వం పరిష్కారం చేయాలని డిమాండ్ చేసారు. బీసీ ఏ రిజర్వేషన్ లేక ముదిరాజ్ యువత ఉద్యోగ రంగంలో అడుగుపెట్టలేని పరిస్థితి దాపురించింది అని ఆవేదన వ్యక్తం చేసారు. యువత ఉద్యోగ ఉపాధి రంగాల్లో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని సమాజంలో ఉన్నత స్థానంలో ఉండాలని సూచించారు.  చిన్న పెద్ద ఉద్యోగాల్లో ఉన్న ముదిరాజ్ ఉద్యోగులు, ప్రొఫెషనల్ రంగాల్లో ఉన్నవారు మన జాతి బిడ్డలకు ప్రోత్సాహం అందించాలని పిలుపునిచ్చారు. మెపా ముదిరాజ్ బిడ్డల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తుందని, ఇందులో భాగంగా ముదిరాజ్ కులబందువుల ప్రయోజనాల కోసం ఎంతవరకైనా కొట్లాడుతుందని అన్నారు. బీసీ D నుంచి బీసీ ఏ సాధన కోసం అవసరం అయితే మెపా ఆధ్వర్యంలో అమరణ నిరాహార దీక్ష చేయడానికి  వెనుకాడే ప్రసక్తే లేదనీ అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొట్ల పల్లి సంజీవన్ మాట్లాడుతూ..ముదిరాజ్ ల విద్య, ఉద్యోగ, సాధికారతే లక్ష్యంగా పని చేస్తున్న  మెపా పై ఎంతమంది ఎన్ని నిందలు వేసిన.. జాతి అభివృద్ధి కోసం వేనుకడుగు వేసే అలోచించనే లేదని అన్నారు. కుట్రలు చేసేవారికి ముదిరాజ్ జాతి బుద్దిజీవులే బుద్ది చెబుతారని అన్నారు.గౌరవ అధ్యక్షులు జగన్ మోహన్ ముదిరాజ్ మాట్లాడుతూ.. జాతి అభివృద్ది ఐక్యత కోసం నా వంతు కృషి చేస్తానని అందుకు అందరికీ కలుపుకుని ముందుకు వెళతామని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర,జిల్లా,మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మెపా నాయకులు సభ్యులు దాసరి వీరన్న,నర్సింహులు, వెంకటయ్య,విజయ్ కుమార్,వేణుగోపాల్,చిరంజీవి,రామాంజనేయులు,కృష్ణ, దాసరివీరన్న,రామ,కృష్ణ,మదు,కుమార్,స్వామి,వెంకన్న,జ్యోతి, స్వప్న,శ్రీలత లతో పాటు 300 మంది పాల్గొన్నారు.
Spread the love