తాడిచెర్ల యాదవ సంఘము ఎన్నిక

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో ఆదివారం యాదవులు సమావేశాన్ని నిర్వహించి నూతన సంఘాన్ని ఎన్నుకొన్నారు. అఖిల భారత యాదవ మహాసభ నూతన కమిటీ అధ్యక్షుగా బొంతల రమేష్ యాదవ్, ఉపాధ్యక్షుగా పన్నాల రాజయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శిగా రాగం రమేష్ యాదవ్ ,సహాయ కార్యదర్శిగా సింగనావేన రాజు యాదవ్,కోశాధికారిగా బొంతల కుమార్ యాదవ్. యూత్ అధ్యక్షుడుగా రాగం సతీష్ యాదవ్,ఉపాధ్యక్షుడుగా నీలం సతీష్ యాదవ్,ప్రధాన కార్యదర్శిగా కురాకుల సుమన్ యాదవ్,కోశాధికారిగా గాధనవెన సాగర్ యాదవ్ తోపాటు పదిమంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కాటారం డివిజన్ మాజీ అధ్యక్షుడు ఆత్మకూరి స్వామి యాదవ్, బోయిని రాజయ్య యాదవ్ ,యాదండ్ల రామయ్య యాదవ్  కొడారి బాపు యాదవ్, చింతల కుమార్ యాదవ్, మొగిలి రాజ్ కుమార్ యాదవ్,రాగం కుమార్ యాదవ్,ఐలయ్య యాదవ్ పాల్గొన్నారు.
Spread the love