నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం ఆలేరు పట్టణంలో నిర్వహించిన ప్రెస్‌క్లబ్ సమావేశంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు.ప్రెస్‌క్లబ్ గౌరవాధ్యక్షులుగా తోట మల్లయ్య, మొరిగాడి మహేష్, అధ్యక్షుడిగా ఎండీ ఖుర్షిత్ పాషా,ఉపాధ్యక్షులుగా తునికి జానకిరామ్, ప్రధాన కార్యదర్శిగా జంపాల దశరథ,కోశాధికారిగా ములెక్కల రవికుమార్ ఎన్నికయ్యారు.సహాయ కార్యదర్శులుగా చింతగింది వెంకటేశ్వర్లు, పోతుగంటి సంపత్ కుమార్, ప్రచార కార్యదర్శిగా సామల సిద్ధులు,సలహాదారులుగా మంచన మల్లేశం, సందెన శంకర్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఎండీ కుర్షిత్ పాషా,ప్రధాన కార్యదర్శి జంపాల దశరథ మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ త్వరలోనే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఆలేరు మండలంలో పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ సమష్టిగా పనిచేస్తుందని పేర్కొన్నారు.సమావేశంలో పలువురు విలేకరులు పాల్గొన్నారు.



