టీఎస్ యూటిఎఫ్ మండల నూతన కమిటీ ఎన్నిక

నవతెలంగాణ – హాలియా
టీఎస్ యూటీఎఫ్ అనుమల మండల నూతన కమిటీని ఆదివారం హాలియా లోని  పెన్షనర్ భవనం లో ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి వడ్త్య రాజు అధ్యక్షత వహించగా, రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం లు ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. జిల్లా కార్యదర్శులు రాచమల్ల రమాదేవి, కే.విజయలక్ష్మి ఎన్నికల అధికారులుగా వ్యవహరించి నూతన కమిటీని ఎన్నుకుని ప్రమాణ స్వీకారం చేయించారు.మండలాధ్యక్షులుగా మన్నెం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి చింతపల్లి రవీందర్,ఉపాధ్యక్షులు చెన్ను వెంకట్ రెడ్డి, మచ్ఛ సునీత, కోశాధికారిసలిగంటి ప్రతాప్ ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ మద్ధెల ప్రసాద్, సోషల్ మీడియా కన్వీనర్ ఎన్. సురేష్ కుమార్ పిఎస్ కాశి వారి గూడెం, కార్యదర్శులు గా రజియా బేగం,కందుల శ్రీదేవి,లూసి మేరి, పి. ఝాన్సి,బి.గంగాధరాచారి,ఆర్.శ్రీనివాస్, వి. భాస్కర్,డి. క్రిష్ణ,ఏ. రాజా, ఆడిట్ కమిటీ కన్వీనర్ యాదయ్య,ఒట్టు కన్వీనర్ కె. మధుసూధన్, అకాడమిక్ కన్వీనర్ కె. నరేష్ కుమార్ మహిళా న్వీనర్ దుస్సా మహేశ్వరి,క్రీడా కన్వీనర్ జీ .శ్యామలాదేవి, సాంస్కృతిక కమిటీ కన్వీనర్ ఓరువాల సరిత,గౌరవ సలహాదారులు ఎం.శ్రీనయ్య, దాస వెంకన్న, కొడుమూరి వెంకట్రామిరెడ్డి, బాణాల వెంకటేశ్వరరావు,ఎస్.కె. షరీఫ్, కాంప్లెక్స్ కన్వీనర్ గా ఆర్. ప్రశాంత్ కుమార్,ఈ. లింగయ్య, దయాకర్ రెడ్డిలను ఎన్నుకున్నారు.
Spread the love