Thursday, May 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకూకట్‌పల్లిలో ఎలక్ట్రిక్ కారు బీభత్సం

కూకట్‌పల్లిలో ఎలక్ట్రిక్ కారు బీభత్సం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానందనగర్ కాలనీలో బుధవారం మధ్యాహ్నం ఓ ఎలక్ట్రిక్ కారు బీభత్సం సృష్టించింది. వివేకానందనగర్ నుంచి ఆల్విన్ కాలనీ వైపు వెళ్తున్న కారు ఓవర్‌స్పీడ్‌తో అదుపుతప్పి ఎదురుగా వెళ్తున్న టూ వీలర్లను, తర్వాత ఎదురుగా వచ్చిన మరో కారును ఢీకొట్టింది. ఆ తర్వాత అవతలి రోడ్డువైపు ఉన్న ఏరువాక టిఫిన్ సెంటర్‌లోకి తీసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం గమనార్హం. అయితే పలు వాహనాలు, టిఫిన్ సెంటర్ ధ్వంసమైంది. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -