Tuesday, May 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చండేగావ్ లో విద్యుత్ సమస్య పరిష్కారం

చండేగావ్ లో విద్యుత్ సమస్య పరిష్కారం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని మారుమూల మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు గ్రామమైన చండేగావ్ గ్రామ సర్పంచ్ ఫిర్యాదు మేరకు విద్యుత్ శాఖ అధికారుల సమన్వయంతో మంగళవారం గ్రామంలోని గత కొన్ని ఏళ్లుగా లో – విద్యుత్తు సరఫరాతో ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు విముక్తి కలిగిందని గ్రామ సర్పంచ్ మరియు జిపి కార్యదర్శి వికాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జిపి కార్యదర్శి మాట్లాడుతూ గ్రామంలోని ఐభాధి కాలని వాసులకు కొన్ని ఏళ్లుగా వివాసముంటున్నప్పటికీ విద్యుత్ సమస్యలతో నిత్యం నరకాన్ని అనుభవిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎండలు పెరిగడంతో విద్యుత్ ఉపయోగం ఎక్కువగా ఉండడం వలన కాలనీలో లో – వోల్టేజ్ సమస్యలతో బాధపడుతూ వస్తున్న ప్రజానీకానికి నిత్యం విద్యుత్తు సమస్య తోడవడంతో చిన్నపిల్లలు , వృద్ధులు,  మహిళలు,  యువకులు, విద్యార్థులు, రాత్రిపూట చదువుకోడానికి,  నిద్రించడానికి , సతమతమవుతున్నారు.

ఈ క్రమంలో కాలనీవాసులు గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ సంప్రదించి సమస్యను వివరించగా స్పందించిన గ్రామ సర్పంచ్ , ఉప సర్పంచ్ కలిసి విద్యుత్ శాఖ అధికారులకు వివరించడం జరిగిందని అన్నారు. వెంటనే అధికారులు గ్రామానికి వచ్చి కాలనీవాసులకు సమస్యను పరిష్కరించాలని ఉద్దేశంతో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. సమస్య ఉన్నదని గమనించిన విద్యుత్ అధికారులు నూతనంగా చిన్న నియంత్రికను అమర్చడం జరిగింది. దీంతో లో – వోల్టేజి సమస్య తీరింది. విషయం కొలిక్కి రావడంతో అబాది కాలనీవాసులు, గ్రామస్తులు కలిసి సర్పంచ్ కు , విద్యుత్ శాఖ అధికారులకు సమస్య పరిష్కరించారని సంతోషం వ్యక్తం చేస్తూ అభినందించామని  పేర్కొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -