నర్సరీలను సందర్శించిన ఉపాధిహామీ ఏపీఓ గిరిహరీష్

నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ గ్రామీణ ఉపాదిహామీ పథకంలో ద్వారా మండలంలోని  రుద్రారం ,ఎడ్లపల్లి, కొయ్యురు గ్రామాల్లో పెంచుతున్న నర్సరీలను ఉపాధిహామీ పథకం ఎంపిఓ గిరి హరీష్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున షెడ్ నెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఉదయం,సాయంత్రం రెండుసార్లు వాచర్ తో వాటరింగ్ చేయించాలని, ఖాళీగా ఉన్న బ్యాగ్స్ లలో లోకల్ స్టంప్స్ కానీ విత్తనాలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు భాస్కర్, ప్రసాద్, ఫీల్డ్ అసిస్టెంట్స్ రవిశంకర్, రాజేందర్ పాల్గొన్నారు.
Spread the love