హైదరాబాద్ : 7వ రాష్ట్రస్థాయి సీనియర్ రగ్బీ టోర్నమెంట్ సోమవారం ముగిసింది. సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో జరిగిన ఫైనల్లో రంగారెడ్డి జిల్లా గెలుపొంది విజేతగా నిలిచింది. రన్నరప్‌గా నల్లగొండ జట్టు నిలువగా.. మేడ్చల్ జిల్లా మూడో స్థానం సాధించింది. మహిళల విభాగంలో మేడ్చల్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు పసిడి, రజత, కాంస్య పతకాలు సాధించాయి. ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, తెలంగాణ రగ్బీ సంఘం అధ్యక్షుడు నరేంద్ర రామ్, కార్యదర్శి ఆదిత్యలు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.