అందరికీ సమన్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం

నవతెలంగాణ – మోపాల్ 

గురువారం రోజున మోపాల్ మండల్ న్యాల్కల్ గ్రామంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి ఆధ్వర్యంలో గడప గడప కు కాంగ్రెస్ ప్రచారం నిర్వహించడం జరిగింది .కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి రేపు ఇందిరమ్మ మనుమడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే  బడుగు బలహీన వర్గాల అట్టడుగు ప్రజలకు కూడా  సంక్షేమ పథకాలు అందుతాయన్నారు ఇప్పటికే ఆరు గ్యారెంటీలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తునమన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇళ్లులేని వారికి ఇంటి స్థలం, నిర్మాణానికి రూ.5 లక్షల సాయం. ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం,  ఆరోగ్య శ్రీ  రూ.10 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని, గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందిస్తున్నమాన్నారు.  రైతు భరోసా ద్వారా రైతులు,  వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తామన్నారు ప్రకటించారు. యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని హామీ. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు . కేంద్రంలో మన పార్టీ అధికారంలోకి వస్తుందని తెలంగాణకు నిధుల వరద కొనసాగుతుందని అందుకే మన ప్రియతమ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ స్థానాల్లోకెల్లా అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ తోనే అభివృద్ధి  సాధ్యమన్నారు . ఈ కార్యక్రమంలో నాయకులు సర్పంచ్ గంగ ప్రసాద్, కిరణ్ రావు, మాజీ ఉపసర్పంచ్ సతీష్, వైస్ ఎంపీపీ అనిత ప్రతాప్ సింగ్ , మాజీ జెడ్పిటిసి మోహన్ కేతవత్  ,తిరుపతిరెడ్డి మరియు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

Spread the love