ప్రజల కష్టాలను తెలిసిన నాయకుడు “ఎర్రబెల్లి”

– బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బిల్లా సుధీర్ రెడ్డి
నవతెలంగాణ – రాయపర్తి
ప్రజల కష్టాలను తెలిసిన ప్రజా నాయకుడు రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బిల్లా సుధీర్ రెడ్డి అన్నారు. గురువారం ఎర్రబెల్లి జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎర్రబెల్లి పదవిలేని పాలకుడు అని అనునిత్యం ప్రజల కష్టాలను తీర్చే మహానుభావుడు అని కొనియాడారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో వేల మంది జీవితాల్లో వెలుగులు నింపాడని వ్యాఖ్యానించారు. ఎర్రబెల్లి జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎనలేని తృప్తినిచ్చిందని తెలిపారు. ఇక ముందు కూడా ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటామని ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ మండల ఉపధ్యక్షుడు పోగులకొండ వేణు, బీఆర్ఎస్ మండల పార్టీ యూత్ నాయకుడు ఉబ్బని సింహాద్రి, కుంట మధు తదితరులు పాల్గొన్నారు.
Spread the love