ఓటు యొక్క ప్రాధాన్యత పై సెల్ఫీ పాయింట్స్ ఏర్పాటు

నవతెలంగాణ – ఆర్మూర్
పార్లమెంట్ ఎలక్షన్ – 2024  స్వీప్ కార్యక్రమంలో భాగంగా గురువారం  మునిసిపల్ పరిధి లో ఓటు ఆవశ్యకతను తెలిపేలా గురువారం పలు జనసమ్మర్ధ ప్రదేశాలలో సెల్ఫీ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్, కమిషనర్ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు వినియోగించుకోవాలని, ఓటు యొక్క ప్రాధాన్యతను వివరించినారు. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ డి ఈ భూమేశ్వర్ ఏ ఈ రఘు, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, , ఈ ఈ పూర్ణ మౌళి తదితరులు పాల్గొన్నారు.
Spread the love