పదవ తరగతిలో రాని ఫలితాలు..వచ్చినట్లుగా ప్రచారం..

– పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి..
– ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్..
నవతెలంగాణ – వేములవాడ 
ఇటీవల ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో కొన్ని పాఠశాలలు రానీ ఫలితాలు..  వచ్చినట్లుగా ప్రచారం చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి అని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ అన్నారు. గురువారం వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రశాంత్ మాట్లాడుతూ పదవ తరగతి ఫలితాలలో కొన్ని పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు రానీ   జిపిఏ కి బదులు ఎక్కువ జీపీఏలు తమ పాఠశాల సాధించిందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అబద్ధం ప్రచారం చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులను ఆయా పాఠశాలలో చేరే విధంగా టెన్త్ జిపిఏ లు చూపించి తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ తెలిసిన విద్యాశాఖ అధికారులు ఏమాత్రం స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. విద్యార్థి తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న పాఠశాలలా యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ తరఫున డిమాండ్ చేశారు. పదిలో రాని ఫలితాలను తమ పాఠశాల విద్యార్థులకు వచ్చాయని చెప్పడం వల్ల ఇన్ని రోజులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. వేములవాడ, సిరిసిల్ల పట్టణ కేంద్రాలలో పలు పాఠశాలలు ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్న పాఠశాలల యజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని యెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అట్టి  పాఠశాలల ముందు ప్రత్యక్ష ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జాలపల్లి మనోజ్ కుమార్ ,నాయకులు వేణు, మోహన్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love